మధురై నుంచి చెన్నైకి బీజేపి 450కి.మి నిరసన ర్యాలీ..! 8 d ago
అన్నా వర్సిటీలో విద్యార్థినిపై అత్యాచార ఘటనకు వ్యతిరేకంగా బీజేపి ఉద్యమాన్ని ఉదృతం చేస్తోంది. బాధితురాలికి న్యాయం చేసేందుకు పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో భారీ ర్యాలీకి పిలుపునిచ్చింది. మదురై నుంచి చెన్నై వరకు దాదాపు 450కి.మీల ర్యాలీ చేపట్టనున్నట్లు బీజేపీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు కె. అన్నామలై వెల్లడించారు. ఈ కేసులో నిందితులు డీఎంకేకు చెందిన వారని, అందుకే ఈ విషయాన్ని దాచి పెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు.